![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -326 లో.. కావ్య ముందు కావాలనే శ్వేతతో రాజ్ మాట్లాడుతుంటాడు. అది కావ్య వినాలని, మాటతీరుతో తనకి కోపం వచ్చేలా చేస్తాడు. శ్వేతతో వీడియో కాల్ లో స్వీటి అంటు ప్రేమగా మాట్లాడతాడు రాజ్. కావ్యని అలా మోసం చెయ్యడం శ్వేతకి నచ్చదు కానీ రాజ్ చెప్పాడని శ్వేత భావిస్తుంది. రాజ్ మాట్లాడిన దానికి సమాధానం చెప్తంటుంది. వాళ్ళు వీడియో కాల్ లో మాట్లాడుతుంటే వాళ్ళని కావ్య డిస్టబ్ చేస్తు.. అటు ఇటు వెళ్తుంటుంది.
ఆ తర్వాత భార్యాభర్తలు ఉన్నప్పుడు.. ఇలా మాట్లాడుకోవడం సంస్కారం కాదని కొంతమందికి తెలియదా అని శ్వేతని ఉద్దేశించి కావ్య అంటుంది. ఇక కావ్య కావాలనే ఫోన్ లో సాంగ్స్ వింటుంది లైట్ అఫ్ చేస్తుంది. ఆ తర్వాత జరగబోయేది చూసి కూడా నీ కాన్ఫిడెంట్ ఇలాగే ఉంటుందేమో చూస్తానని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు కళ్యాణ్ శోభనం కోసం హుషారుగా ఏర్పాట్లు చేసుకుంటాడు. పాల గ్లాస్ తో అప్పుడే అనామిక లోపలికి ఎంట్రీ ఇస్తుంది. నీకు ఒక విషయం చెప్పాలి అంటు నాకు ఈ రోజుకి మూడు రోజులు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనగానే కళ్యాణ్ గుక్క పట్టి ఏడుస్తుంటాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు.. మళ్ళీ శోభనం ఆగిపోయిందా అని అందరు అనుకుంటారు. అనామిక అలా అనగానే కళ్యాణ్ సరే అంటాడు. నిన్ను నా వాడిని చేసుకునే దాకా నేను నీ దాన్ని అవ్వను.. ఆఫీస్ పగ్గాలు నీకు.. ఇంట్లో మహారాణిలా నేను ఉండాలని అనామిక అనుకుంటుంది. ఆ తర్వాత అప్పు దగ్గరికి కృష్ణమూర్తి వచ్చి మాట్లాడుతాడు. నేను నిజంగానే పోలీస్ అవ్వాలని అనుకుంటున్నా అని అప్పు అనగానే కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతు సపోర్ట్ చేస్తాడు.
మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ బయటకు వస్తుంటే శోభనం జరిగిందని అందరూ అనుకునేలా కళ్యాణ్ ని రెడీ చేసి అనామిక బయటకు పంపిస్తుంది. కళ్యాణ్ ని చూసిన సుభాష్, ప్రకాష్ ఇందిరాదేవిలు నవ్వుకుంటారు.. వెళ్లి రెడీ అయిరా అంటూ కళ్యాణ్ ని పంపిస్తారు. అందరు నమ్మారా అని అనామిక అడుగుతుంది. మరోవైపు అప్పు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తు ఉంటుంది. తరువాయి భాగంలో ఇక ఈ ఇంటికి పెద్ద కోడలిగా అన్ని బాధ్యతలు నీకే ఇస్తున్నా.. ఇదిగో తాళాలు ఇక ఎవరికి ఏం అవసరం వచ్చిన నీ దగ్గరికే రావాలని కావ్యకు అపర్ణ చెప్తుంది. అది విని రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |